ఈ మధ్య కాలంలో విమానాల నిర్వహణ సరిగా లేక, తలుపులు, అద్దాలు ఊడిపోవడంలాంటి వార్తలు అనేకం విన్నాం. అలాంటి కోవకు చెందిన మరో ఘటన అమెరికాలో వెలుగు చూసింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం శాన్ప్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గాల్లోకి లేవగానే వెనుక వైపు టైరు ఊడి పార్కింగ్‌లో ఉంచిన ఓ కారుపై పడింది. కారు నుజ్జునుజ్జయింది. అయితే ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
విమానం టైరు ఊడి కింద పడిపోవడాన్ని ఫైలెట్ గుర్తించారు. వెంటనే విమానాన్ని దారి మళ్లించారు. లాస్ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. ఈ విమానంలో 235 మంది ప్రయాణీకులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారిని మరో విమానంలో ఎక్కించి గమ్యం చేర్చారు.
అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్ గేర్లకు ఆరు చొప్పున మొత్తం 12 టైర్లు ఉంటాయి. ఒకటి ఊడినా పెద్దగా ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు