మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు భారత వ్యతిరేక వైఖరి వీడటం లేదు. తమ దేశంలోని భారత సైన్యాన్ని పూర్తిగా విరమించుకోవాలంటూ పలుమార్లు కోరిన మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ ఉచితంగా అందజేయడంతోపాటు, సిబ్బందిని కూడా నియమించిన హెలికాప్టర్‌ను ఇక నుంచి తమ సిబ్బంది నియంత్రిస్తారంటూ ప్రకటించారు.
తమ దేశంలో భారత దళాల ఉపసంహరణపై చర్చలు కొనసాగుతున్నాయని మొయిజ్జు తెలిపారు. మే 10 తరవాత తమ భూ భాగంలో ఏ దేశానికి చెందిన సైన్యం ఉండటానికి వీల్లేదని ప్లాన్స్, రీసోర్సెస్ విభాగం డైరెక్టర్ మహమ్మద్ ప్రకటించారు. హెలికాఫ్టర్ నిర్వహణకు సైన్యాన్ని ఉపసంహరించి, సాధారణ సిబ్బందిని పంపినట్టు భారత్ ప్రకటించింది.
గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా అనుకూల మొయిజ్జు అధికారం చేజిక్కించుకున్నారు. భారత సైన్యాన్ని వెనక్కు పంపిస్తానంటూ ఆయన ఎన్నికల్లో కూడా ప్రచారం చేయడంతో, ఇప్పుడు అదే పనిచేస్తున్నారు. సర్వేలు నిర్వహించడానికి భారత్‌తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం కూడా రద్దు చేసుకుంటున్నట్లు మొయిజ్జు ప్రకటించడం విశేషం.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు