భారత్,
ఇంగ్లండ్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న
టెస్టులో మొదటి రోజు ఆటలో రోహిత్ సేన అదరగొట్టింది. 218 పరుగులకే ఇంగ్లండ్ తొలి
ఇన్నింగ్స్ ను భారత బౌలర్లు కుదించగా, లక్ష్య ఛేదనలో ఓపెనర్లు శుభారంభం చేశారు.
యువ
ఆటగాడు యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీ చేసి ఔట్ కాగా , మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్
శర్మ 83 బంతులు ఆడి 52 పరుగులు చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 50
సిక్సర్ల మార్కును చేరుకుని రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా
క్రికెటర్ గా రోహిత్ నిలిచాడు.
58 బంతుల్లో 57 పరుగులు చేసి స్టంప్ ఔట్ గా
వెనుదిరిగిన జైస్వాల్ ఈ మ్యాచ్ తో పలు రికార్డులు కొల్లగొట్టాడు. తొమ్మిదో
ఓవర్ లో వరుసగా మూడు సిక్సులు బాది, ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు కొట్టిన
బ్యాటర్ గా నిలిచాడు. గతంలో సచిన్ టెండుల్కర్ ఆస్ట్రేలియాపై 25 సిక్సులు కొట్టగా,
జైస్వాల్ ఇంగ్లండ్ సిరీస్ లో 26 సిక్సులు బాదాడు. సచిన్ 74 ఇన్నింగ్సుల్లో ఈ
రికార్డు సాధిస్తే జైస్వాల్ 9 ఇన్నింగ్స్ లోనే ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.
మరో
రికార్డు కూడా జైస్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి
చేసుకున్న సెకండ్ ఫాసెస్ట్ ఇండియన్ గా రికార్డుకెక్కాడు.
మొదటి
రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో రోహిత్ శర్మ( 52*), గిల్( 26*) క్రీజులో ఉన్నారు. 30 ఓవర్లకు భారత్
ఒక వికెట్ నష్టపోయి 135 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో
నిర్ధేశించిన 218 లక్ష్యాన్ని చేరేందుకు మరో 83 పరుగులు అవసరం.