చిత్తూరు జిల్లాలో వైసీపీకి
ఎదురుదెబ్బ తగిలింది. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన పార్టీలో చేరారు. ఆరణి శ్రీనివాసులుకు జనసేన అధినేత
పవన్, పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
జనసేనలో
చేరిక సందర్భంగా మాట్లాడిన ఆరణి శ్రీనివాసులు,
వైసీపీలో ఎన్నో అవమానాలు
ఎదుర్కున్నట్లు చెప్పారు. బలిజ సామాజిక వర్గానికి సంబంధించి రాయలసీమలో తాను
ఒక్కడినే గెలిచానన్నారు. అలాంటి తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా అన్యాయం
చేశారని ఆవేదన చెందారు.
జనసేన
పార్టీ సిద్ధాంతాలు నచ్చడంతోనే పవన్ తో కలిసి నడిచేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. చిత్తూరులో
జనసేన అభిమానుల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆరోపించిన ఆరణి శ్రీనివాసులు, తిరుపతిలో పేదల ఇళ్లను వైసీపీ నేతలు తొలగించారన్నారు.
రాయలసీమప్రాంతం కొందరి చేతుల్లో
చిక్కుకుపోయిందన్న జనసేన అధినేత పవన్, చిత్తూరు జిల్లా ఓ కుటుంబ చేతిలో బందీగా
మారిందన్నారు. వైసీపీ నేతలు తిరుపతిని అడ్డుగోలుగా దోచుకుంటున్నారన్నారు. భయం
వదిలేస్తేనే పరిస్థితుల్లో మార్పు వస్తుందన్నారు.