భారత్,
ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ధర్మశాల టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి
బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ను 218 పరుగులకే ఆలౌట్ చేశారు. 57.4 ఓవర్లు ఆడిన
ఇంగ్లండ్, 218 పరుగులకే పెవిలియన్ చేరింది.
కుల్దీప్
యాదవ్ ఐదు వికెట్లు తీయగా, రవిచంద్ర అశ్విన్ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ వికెట్ తీయడంతో ఇంగ్లండ తొలి ఇన్నింగ్స్ ఖతమైంది.
ఇంగ్లండ్
ఇన్నింగ్స్ ను జాక్ క్రాలే, బెన్ డకెట్
ప్రారంభించగా తొలి ఓవర్ బుమ్రా వేశాడు. తొలి వికెట్ కు ఇద్దరు కలిసి 108 బంతులు
ఆడి 64 పరుగుల భాగస్వామ్యాన్ని
నెలకొల్పారు. అయితే కుల్దీప్ యాదవ్ వేసిన 17.6 బంతికి ఇంగ్లండ్ తొలి వికెట్
నష్టపోయింది. శుభమన్ అద్భుతంగా ఫీల్డింగ్ చేసి క్యాచ్ పట్టడంతో బెన్ డకెట్ ( 27)
వెనుదిరిగాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చి ఓలీ పోప్(11) స్టంప్ ఔట్ అయ్యాడు. కుల్
దీప్ వేసిన 25.3 బంతిని ముందుకెళ్ళి ఆడబోగా ధ్రువ్ స్టంప్ చేశాడు. దీంతో 100
పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ నష్టపోయింది.
కుల్
దీప్ వేసిన 37.2 బంతికి జాక్ క్రాలే పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ మూడో వికెట్
నష్టపోయింది. జాక్ క్రాలే (79) బౌల్డ్ అయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో క్రాలేదే అత్యధిక
స్కోర్, 108 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి 79 పరుగులు చేశాడు.
ఆ తర్వాత 175 పరుగులు వద్ద ఇంగ్లండ్ వరుసగా
మూడు వికెట్లు కోల్పోయింది.
కుల్దీప్
బౌలింగ్ లోనే జానీ బెయిర్ స్టో వెనుదిరిగాడు. 18 బంతుల్లో 29 పరుగులు చేసిన బెయిర్
స్టో, కీపర్ ధ్రువ్ జురైల్ కు క్యాచ్ గా
దొరికిపోయాడు. ఆ తర్వాత 44.2 బంతికి జో
రూట్( 26), పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఎల్బీ అయ్యాడు. కుల్ దీప్
వేసిన 44.5 బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (0) కూడా ఎల్బీ అవ్వడంతో ఇంగ్లండ్
ఆరు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది.
బెన్ ఫోక్స్, టీమ్ హార్ట్ లే, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్ ను రవిచంద్రన్
అశ్విన్ పెవిలియన్ కు పంపాడు.
టామ్
హార్ట్ లే(6 ) అశ్విన్ వేసిన 49.2 బంతికి ఔట్ అయ్యాడు. దీంతో 183 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఏడో వికెట్
నష్టపోయింది. అదే ఓవర్ లో నాలుగో బంతికి
మార్క్ వుడ్ (0 ) కూడా వెనుదిరిగాడు. 218 పరుగుల వద్ద బెన్ ఫోక్స్ ను తొమ్మిదో వికెట్ గా నష్టపోయిన ఇంగ్లండ్, 57.4
బంతికి అండర్సన్ ఔట్ కావడంతో 218 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగిసింది.