తిరుపతి
శ్రీనివాసమంగాపురం వేంచేసిన శ్రీ కల్యాణ
వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేటి
(గురువారం) ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు రథాన్ని అధిరోహించి
భక్తులను ఆశీర్వదించారు.
శ్రీ
వేంకటేశుడి రథాన్ని దర్శించిన వారికి
జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు. రథస్తుడైన మాధవుడిని
దర్శిస్తే పునర్జన్మ ఉండదని విశ్వసిస్తారు.
నేటి
రాత్రికి స్వామివారు అశ్వ వాహనంపై దర్శనమిస్తారు.
స్వామివారు బుధవారం రాత్రి, చంద్రప్రభ వాహనంపై నుంచి దర్బార్ కృష్ణుడి అలంకారంలో
విహరించారు. ఈ వాహనసేనవు వీక్షించిన వారికి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవకమనే
తాపాలు నశిస్తాయి.
వార్షిక
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామికి శుక్రవారం ఉదయం
చక్రస్నానం జరగనుంది.
కపిలతీర్థంలో..
తిరుపతి
శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. నేటి ఉదయం కపిలేశ్వరస్వామి
, కల్పవృక్ష వాహనంపై భక్తలకు దర్శనమిచ్చారు.
బుధవారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి గజ వాహనంపై విహరించారు. ఆద్యంతరహితుడైన
శివుడు, ఐశ్వర్య సూచిక అయిన గజాన్ని అధిరోహించినప్పుడు వీక్షించాలంటే భక్తులు ఎంతో
పుణ్యం చేసుకుని ఉండాలి.