Narrow escape for Zelenskyy and Mitsotakis from Russian Attack
ఉక్రెయిన్‌లోని ఒడెస్సా ఓడరేవు పట్నంలో ఓ
హ్యాంగర్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా చేసిన దాడి నుంచి ఇద్దరు దేశాధినేతలు తప్పించుకున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, గ్రీస్
ప్రధాని కిరియకోస్ మిత్సటకోస్ బుధవారం ఒడెస్సాలో పర్యటిస్తున్నారు. ఆ సమయంలోనే,
వారికి కేవలం అరకిలోమీటరు దూరంలో రష్యన్ క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్
అధ్యక్షుడు, గ్రీస్ ప్రధానమంత్రి ఆ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
దాడి ఘటనను రష్యా రక్షణశాఖ ధ్రువీకరించింది. ఒడెస్సాలో
ఉక్రెయిన్ దళాలు సముద్ర డ్రోన్లను సిద్ధం చేస్తున్న ఓ హ్యాంగర్‌ను లక్ష్యంగా
చేసుకుని దాడి చేసినట్లు ప్రకటించింది. తమ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని
ఛేదించిందని వెల్లడించింది.
ఉక్రెయిన్ వర్గాలు మాత్రం
జెలెన్స్కీ, మిత్సటకోస్ ప్రాణాంతక దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారని చెబుతున్నాయి.
పేలుడు జరిగిన చోట భారీగా పొగలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ
ఘటనలో ఐదుగురు ఉక్రేనియన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారని
ఉక్రెయిన్ వెల్లడించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు