తెలుగుదేశం
పార్టీ(TDP)-జనసేన
పార్టీ(JSP)ల ఉమ్మడి మేనిఫెప్టోను ఈ నెల 17న
విడుదల చేయనున్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ ఆంధ్రప్రదేశ్
అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు
వెల్లడించారు. ఈ నెల 17న చిలకలూరిపేట బహిరంగసభలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు.
టీడీపీ-జనసేన కూటమి తొలివిడత జాబితాతో వైసీపీ నేతలు వణకిపోతున్నారని అచ్చెన్నాయుడు
ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ పాలనదారుణ పరిస్థితుల్లోకి
తీసుకెళ్ళిందన్నారు. బహిరంగసభ ద్వారా
భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. టీడీపీ, జనసేన నేతలపై పోలీసుల
వేధింపులు మానుకోకపోతే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమన్నారు. వేధింపుల నుంచి పార్టీ
శ్రేణుల్ని కాపాడేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను (73062
99999) ఏర్పాటు
చేశామన్నారు. సభకు ఆర్టీసీ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీని కోరారు.
చిలకలూరిపేట
సభ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఇరు పార్టీలు కలిసి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక ప్రకటిస్తాయన్నారు. జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరబడి భయపెట్టడం
దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు సరికాదన్నారు.