అయోధ్యలో
ఇటీవల ప్రారంభమైన రామమందిరానికి సంబంధించిన వెబ్సైట్ ను హ్యాక్ చేసేందుకు
దుండగులు విఫలయత్నం చేశారు. భక్తుల సౌకర్యార్థం, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర
ట్రస్టు వారు వెబ్సైట్ ను అందుబాటులోకి తెచ్చారు. దీనిని హ్యాక్ చేసేందుకు చైనాకు
చెందిన హ్యాకర్లు ప్రయత్నించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పలు ప్రభుత్వ వెబ్సైట్లపై
కూడా సైబర్ దాడి జరిగింది.
అయోధ్యలో
రామమందిర ప్రారంభోత్సవానికి ముందు కూడా పాకిస్తాన్, చైనాకు చెందిన హ్యాకర్లు అయోధ్య
రామాలయ వెబ్ సైట్ తోపాటు, ప్రసార భారతి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన
పలు వెబ్సైట్లను డౌన్ చేసేందుకు విఫలప్రయత్నం చేశారు. ఈ దాడులను ముందే పసిగట్టిన భారత
ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటలెజన్స్
ఉపయోగించి తిప్పికొట్టింది. భారత్ కు చెందిన సైబర్ నిపుణుల సాయంతో 1200 ఐపీ అడ్రస్ లను కేంద్రప్రభుత్వం బ్లాక్ చేయగా
అందులో ఎక్కువ చైనాకు చెందినవే ఉన్నాయి.