భారత్,
ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి టెస్ట్ ధర్మశాల వేదికగా
జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్, బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 3-1
తో సిరీస్ గెలుచుకున్న భారత్ కు ఈ టెస్ట్ నామమాత్రమే.
ఇంగ్లండ్
బ్యాటింగ్ ను జాక్ క్రాలే, బెన్ డకెట్ ప్రారంభించగా తొలి ఓవర్ ను బుమ్రా వేశాడు.
12 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లిష్ జట్టు వికెట్లు ఏమీ నష్టపోకుండా 43 పరుగులు చేసింది.
కుల్ దీప్ యాదవ్ వేసిన 17.6 బంతికి బెన్ డకెట్ ఔట్ అయ్యాడు. 58 బంతులు ఆడి 27 పరుగులు
చేసి శుభమన్ గిల్ కు క్యాచి ఇచ్చి పెవిలియన్ చేరాడు.
21
ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి ఇంగ్లండ్ జట్టు 70 పరుగులు చేసింది.
ఈ
మ్యాచ్ తో భారత్ తుది జట్టులో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ కు స్థానం దక్కింది.
రజత్ పాటిదార్ స్థానంలో జట్టులో చేరాడు. ఇక
ఆకాష్ దీప్ స్థానంలో బుమ్రా జట్టులోకి వచ్చాడు.
ఇంగ్లండ్
కేవలం ఒకే ఒక్క మార్పుతో ఆడుతోంది. పేసర్ రాబిన్ సన్ కు బదులు మార్క్‌వుడ్ ను తుది
జట్టులోకి తీసుకుంది.
భారత
క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ధర్మశాల మ్యాచ్ తో రికార్డు సృష్టించాడు.
కెరియర్ లో
వందో టెస్టు ఆడుతున్న అశ్విన్, ఈ ఘనత సాధించిన 14వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు.
99 టెస్టులు ఆడి 507 వికెట్లు తీసిన అశ్విన్
116 వన్డేల్లో 156 వికెట్లు తన ఖాతాలో
వేసుకున్నాడు. 65 టీ20ల్లో 72 వికెట్లు తీయగా 35 సార్లు ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించగా, 8సార్లు 10 వికెట్లు చొప్పున తన
ఖాతాలో వేసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.