Covid cases on raise again in India
గత 24 గంటల్లో ఢిల్లీలో 63 కొత్త కోవిడ్ కేసులు
నమోదయ్యాయి. మే 23 తర్వాత, ఒక రోజులో దేశ రాజధానిలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైనది
ఇవాళే. ఢిల్లీతో పాటు రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో కోవిడ్
కేసులు పెరుగుతున్నాయి.
గత పదిహేను రోజుల్లో ఢిల్లీలో 459 వైరస్ కేసులు
నమోదు కాగా, అంతకుముందు పక్షంలో 191, అంతకుముందు
15 రోజుల వ్యవధిలో 73 కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాజస్థాన్‌లో గత 15 రోజుల్లో 226
కేసులు నమోదయ్యాయి. టెస్టింగ్ తక్కువగా ఉండటంతో వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉండవచ్చని
నిపుణులు అంచనా వేస్తున్నారు.
దాదాపు రెండు నెలల తర్వాత ఉత్తరాదిలో
ఇప్పుడిప్పుడే కరోనా విజృంభిస్తోంది. ఢిల్లీ, రాజస్థాన్
లతో పాటు యూపీ, బిహార్ లలోనూ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం
యూపీలో 164 కేసులు, బీహార్లో
103 కేసులు నమోదయ్యాయి.
ఈ శీతాకాలం (డిసెంబర్-జనవరి)లో కేసులు మళ్లీ
పెరిగాయి, అత్యధిక రోజువారీ నమోదు సంఖ్య డిసెంబర్ 30 న దేశమంతా
కలిపి 841 గా నమోదైంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ కేసులు కేరళలో నమోదయ్యాయి. ఇటీవల
కేసులు పెరిగిన కర్ణాటకలో, తాజా 15 రోజుల వ్యవధిలో 268 కొత్త కేసులు
నమోదయ్యాయి. మహారాష్ట్రలో గత రెండు వారాల్లో 466, 555
కేసులు నమోదు కాగా తాజా కాలంలో 496 కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ ఇలా అడపాదడపా
విజృంభించడం సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో
వ్యాప్తి చెందుతున్న వైరస్ స్ట్రెయిన్ గురించి ఇంకా ఎలాంటి సమాచారమూ లేదు.