జమ్ము-కశ్మీర్
లో ప్రధాని నరేంద్రమోదీ నేడు పర్యటించనున్నారు. ఐదేళ్ళ కిందట ఆర్టికల్ 370ని రద్దు
చేసిన తర్వాత కశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే అతిపెద్ద రాజకీయ ర్యాలీ
ఇదే కావడం గమనార్హం. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ విస్తృత ప్రచార అంకంలో
శ్రీనగర్ ర్యాలీ కీలకంగా మారనుంది.
370
లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న బీజేపీ,
కేంద్రప్రభుత్వ చొరవతోనే ఆర్టికల్
370 రద్దు సాధ్యమైందని బీజేపీ ఇప్పటికే తన
ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతోంది.
బక్షి
స్టేడియం వేదికగా ప్రధాని మోదీ
ప్రసంగించనున్నారు. శ్రీనగర్ అంతటా వేలాది మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు.
రెండు
లక్షల మంది హాజరవుతారని అంచనా వేసిన బీజేపీ నేతలు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు
చేశారు.
బీజేపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడుతూ…‘‘ కశ్మీర్ లో అవినీతి అంతమైంది, అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధిని సాధిస్తున్నాం, ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అకాశాలు లభిస్తున్నాయి, ఆర్టికల్ 370 సంకెళ్లను విచ్ఛిన్నం
చేసిన ప్రధాని మోదీ మాట వినడానికి జమ్మూకశ్మీర్ ప్రజలు వస్తారు.’’ అని అన్నారు.
జమ్మూ
ప్రాంతం, లోయలోని సుదూర ప్రాంతాల నుంచి వివిధ
జిల్లాల ప్రజలు ఇప్పటికే శ్రీనగర్ చేరుకున్నారు. వారి వసతి, భోజనాల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.
ర్యాలీ
లోపాల్గొనే వారందరి పూర్వాపరాలను భద్రతా సంస్థలు ధృవీకరించాయి. ర్యాలీని కవర్ చేసే
జర్నలిస్టులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, భద్రతా
తనిఖీల తర్వాతే పాసులు జారీ చేశారు.
ప్రధాని
పర్యటన నేపథ్యంలో పలు పాఠశాలలను మూసివేశారు.శ్రీనగర్ లోని పలు రహదారులను సాధారణ
రాకపోకలకు మూసివేయడంతో ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.
పర్యాటకం, వ్యవసాయానికి సంబంధించిన పలు
ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రకటించే అవకాశం ఉంది. కశ్మీర్ లోని ప్రఖ్యాత హజ్రత్
బల్ మందిరం సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు.