1317KG Ganja seized in Assam, two arrested
అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో చురైబరీ పోలీస్
వాచ్‌పోస్ట్ దగ్గర ఇద్దరు వ్యక్తులు 1317 కేజీల గంజాయితో పట్టుబడ్డారు. పోలీసులు
వారిని బల్బీర్ సింగ్, విజయ్ కుమార్ సింగ్‌గా గుర్తించారు.
‘‘విశ్వసనీయ సమాచారం మేరకు కరీంగంజ్ జిల్లా పోలీసులు
మార్చి 5న అస్సాం త్రిపుర సరిహద్దుల వద్ద చురైబరీ చెక్‌పోస్ట్ దగ్గర ఒక ట్రక్కును
నిలువరించారు. ఆ ట్రక్కును తనిఖీ చేసారు. పోలీసులకు ఆ ట్రక్కులో 439 ప్యాకెట్లు
దొరికాయి. వాటిలో 1317 కేజీల గంజాయి ఉంది. ట్రక్కుకు అమర్చిన రహస్య అరలో ఆ
గంజాయిని దాచారు. ఆ ట్రక్కు త్రిపుర నుంచి అస్సాంలోకి ప్రవేశిస్తుండగా
పట్టుకున్నారు’’ అని పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేసారు.
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్
చేసారు. పట్టుకున్న గంజాయి విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కేసుకు
సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.
అస్సాంలో ఇంత పెద్దస్థాయిలో గంజాయి పట్టుబడడంపై
రాష్ట్ర ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేసారు. పోలీసుల కృషిని అభినందిస్తూ ఆయన ట్వీట్
చేసారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు