శక్తిపీఠం,
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
కనులపండగగా కొనసాగుతున్నాయి. మహాదేవుడి భక్తులతో శ్రీగిరి ప్రాంతం
కిటకిటలాడుతోంది.
బ్రహ్మోత్సవాల ఐదో రోజు క్రతువులో భాగంగా మంగళవారం సాయంత్రం మల్లికార్జునుడు,
భ్రమరాంబా సమేతంగా దశకంఠుడైన రావణుడి భుజస్కంధాలపై విహరించి భక్తులను
ఆశీర్వదించారు. గంగాధర మండపం నుంచి బయలువీరభద్ర
స్వామి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించగా భక్తులు దర్శించుకున్నారు.
ఆరోరోజు
బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నేడు ఆదిదంపతులకు పుష్పపల్లకీ సేవ
నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల
పర్వదినాలకు భక్తుల పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో అదే స్థాయిలో ఆలయ అధికారులు
ఏర్పాట్లు చేశారు. క్షేత్ర పరిధిలోని ఉపాలయాలను
భక్తులు దర్శించుకునేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. కైలాసద్వారం, హటకేశ్వరం,
సాక్షి గణపతి, పాలధార- పంచధార, టోల్ గేట్, టూరిస్ట్ బస్టాండ్, గణేశ సదనం వరకు
బస్సు సర్వీసులు నడుపుతున్నారు.
భక్తులకు అందించే సేవల్లో ఎలాంటి లోపం లేకుండా చర్యలు
తీసుకోవాలని సిబ్బందిని ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు. అన్నప్రసాదానికి తాజా
కూరగాయలు, నాణ్యమైన సరుకులు మాత్రమే ఉపయోగించాలన్నారు. అలాగే వైద్యశాల, క్యూలైన్లు,
కంట్రోల్ రూమ్ ను సందర్శించి ఆలయ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. పారిశుధ్య చర్యలు ముమ్మరం
చేయాలని ఆదేశించారు.