తిరుపతి శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ
వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పలు వాహన సేవలు
నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి గజవాహనంపై నుంచి అనుగ్రహించిన
శ్రీమన్నారాయణుడు, ఏడో రోజు బుధవారం స్వామివారు ఉదయం సూర్యప్రభ వాహనం నుంచి
భక్తులను కటాక్షించారు. రాత్రికి
స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లు
ఉదయం, సాయంత్రం అలంకరణలు, వాహనసేవల్లో
పాల్గొంటారు. వారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహిస్తారని అర్చకులు
తెలిపారు.
వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు
పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు.
కపిలేశ్వరుడి
బ్రహ్మోత్సవాలు …
శ్రీ
కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మంగళవారం రాత్రి మహాదేవుడు,
శ్రీసోమస్కందమూర్తి అలంకారంలో అధికార నంది వాహనంపై అభయమిచ్చారు.
శ్రీ కపిలేశ్వరుడి వాహనసేవలలో అధికారనందికి
విశిష్ఠమైన స్థానం ఉంది. ఈ అధికారనందికే మరోపేరు కైలాసనంది. మువ్వలదండలు, గజ్జెలతో మనోహరాకారంతో,
బంగారుకొమ్ములతో అలరారే నందే ఆ కైలాశాధీశుడికి నిత్యవాహనం.
నేటి ఉదయం (బుధవారం) స్వామి వారు
వ్యాఘ్ర వాహనంపై నుంచి భక్తులకు దర్శనమిచ్చారు.