PM Modi to inaugurate under water metro in Kolkata today
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కోల్‌కతాలో
అండర్ వాటర్ మెట్రో సేవలను ప్రారంభిస్తారు. హుగ్లీ నది కింద ఈ మెట్రో ప్రాజెక్టును
ఏర్పాటు చేసారు. ఆధునిక భారత రైల్వే చరిత్రలో నూతన అధ్యాయానికి అండర్ వాటర్ మెట్రో
శ్రీకారం చుడుతుంది.
దేశంలోనే మొట్టమొదటిది అయిన ఈ అండర్
వాటర్ మెట్రో కోల్‌కతాలోని ఈస్ట్‌కోస్ట్ మెట్రో కారిడార్‌లో హౌరా మైదాన్ ఎస్ప్లనేడ్
సెక్షన్లో ప్రయాణికులకు సేవలందిస్తుంది. కోల్‌కతా పరిధిలో జంట నగరాలైన హౌరా,సాల్ట్ లేక్ లను కలుపుతూ ఈ మెట్రో
రైల్వే సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. హుగ్లీ నది అడుగున నిర్మించిన తొలి
మెట్రో సొరంగ మార్గంగానూ, దేశంలోనే
తొలిసారిగా నది అడుగున నిర్మించిన తొలి రవాణాగానూ ఇది రికార్డు సృష్టించింది.
ఈస్ట్ – వెస్ట్ మెట్రో మొత్తం పొడవు
16.6 కిలోమీటర్లు. అందులో 10.8 కిలోమీటర్ల మేర రైలు భూగర్భంలో ప్రయాణిస్తుంది. 4.8
కిలోమీటర్ల మార్గం సాల్ట్ లేక్ సిటీ ఐదో సెక్టార్, సియాల్డాలోని ఐటీ హబ్‌ను కనెక్ట్ చేస్తుంది.
ఈ సెక్షన్లో మొత్తంగా ఆరు స్టేషన్లు
ఉంటాయి. వీటిలో మూడింటిని భూగర్భంలోనే కట్టారు. రద్దీ, కాలుష్యం ఎక్కువ ఉండే కోల్‌కతాలో పర్యావరణ హిత ప్రయాణానికి వీలుగా ఈ
మెట్రోను భూగర్భంలో డిజైన్ చేశారు. దీంతో కాలుష్యం తగ్గడంతో పాటు ప్రయాణ సమయమూ
తగ్గుతుంది.
ప్రధానమంత్రి ఇవాళ ఈ మెట్రోను ప్రారంభించాక,
గురువారం నుంచి సాధారణ పౌరులను ప్రయాణానికి అనుమతిస్తారు.