కెమికల్
డిజాస్టర్స్ పై మాక్‌డ్రిల్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ విపత్తులు నిర్వహణ సంస్థ
ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ఏడో తేదీన(గురువారం) మాక్ ఎక్సర్సైజ్
నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్
సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు
తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా
రసాయనాలు, గ్యాస్ వినియోగించే 22 పరిశ్రమల్లో మాక్ ఎక్సర్సైజ్
నిర్వహించనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు. జిల్లాస్థాయి అధికారులతో వీడియో
కాన్ఫరెన్స్ నిర్వహించి సన్నద్ధతపై ఆరా తీశారు.
సమీక్ష కార్యక్రమంలో రిటైర్డ్ కమాండెంట్ ఆదిత్య
కుమార్ ఎన్డీఎంఎ, విపత్తుల
సంస్థ ఎండీ కూర్మనాథ్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.ఎస్.సి వర్మ, ఈడి డా.సి.నాగరాజు పాల్గొన్నారు. ఎన్డీఎంఎ సభ్యులు
లెఫ్టనెంట్ జనరల్ సయ్యద్ హస్నైన్ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
హాజరయ్యారు.