కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన అభిజిత్ గంగోపాధ్యాయ్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా చేస్తూ రాజీనామా చేసిన అభిజిత్ గంగోపాధ్యాయ్, తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. టీఎంసీ అవినీతికి మారుపేరన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అభిజిత్ గంగోపాధ్యాయ్ పోటీ చేస్తారనే వార్తలు వైరల్‌గా మారాయి.
టీఎంసీ అవినీతి పాలనపై ప్రత్యక్షంగా పోరాడేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు గంగోపాధ్యాయ్ ప్రకటించారు. వామపక్షాలకు పట్టిన గతే టీఎంసీకి కూడా పడుతుందని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ దేశం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ నెల 7న ప్రధాని బెంగాల్ పర్యటన సమయంలో గంగోపాధ్యాయ్ బీజేపీ కండువా కప్పుకునే అవకాశం కనిపిస్తోంది.