అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ వ్యతిరేక వైఖరి, చైనా అనుకూల విధానాలు అనుసరిస్తున్న మాల్దీవుల
అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు, మరోసారి నోరుపారేసుకున్నారు. ఈ ఏడాది మే 10 తర్వాత మాల్దీవుల
భూభాగంలో భారత ఆర్మీ సిబ్బంది ఉండేందుకు
వీలు లేదన్నారు. సాధారణ దుస్తుల్లోని సాంకేతిక సిబ్బంది కూడా తమ దేశంలో ఉండడాటానికి
కుదరదని వ్యాఖ్యానించారు.
మాల్దీవుల్లోని మూడు విమానయాన
కేంద్రాలను భారత ఆర్మీ సిబ్బంది నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు, సహాయ
కార్యక్రమాల సమయంలో వీటిని వినియోగిస్తున్నారు. మయిజ్జూ అధికారంలోకి వచ్చిన తర్వాత
భారత ఆర్మీని తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించారు. మార్చి 10 వరకు గడువు
విధించారు. దీంతో భారత ప్రభుత్వం, ఆర్మీకి బదులు సాంకేతిక
నిపుణులను పంపింది. వీరు మాల్దీవలు చేరుకున్న కొన్ని గంటల్లోనూ మయిజ్జూ ఈ
వ్యాఖ్యలు చేశారు.
మాల్దీవుల్లోని వైమానిక
స్థావరాల్లో ఒక దాని నుంచి మార్చి 10 లోగా, మిగతా రెండింటి నుంచి మే 10లోగా ఖాళీ
చేసి వెళ్ళిపోవాలని మయిజ్జు కోరారు.
తమ బలగాల స్థానంలో సాంకేతిక సిబ్బందిని
నియమించుకునేందుకు మాల్దీవుల ప్రభుత్వం అంగీకరించింది. దీంతో గత వారమే భారత్ నుంచి
సాంకేతిక సిబ్బంది మాల్దీవులు వెళ్ళారు. దీనిపై మాల్దీవుల్లోని విపక్ష పార్టీలు
సందేహాలు వ్యక్తం చేశాయి. భారత ఆర్మీ సిబ్బందినే పౌర దుస్తుల్లో పంపుతున్నారని
ఆరోపించారు. దీనిపై స్పందించిన మయిజ్జు, మే 10 తర్వాత సాంకేతిక సిబ్బంది కూడా
భారత్ తిరిగి వెళ్ళాల్సిందేనన్నారు.