కర్ణాటక అసెంబ్లీ ఆవరణలో పాక్ అనుకూల నినాదాలు చేసిన ముగ్గురు నిందితులను మూడు రోజుల కస్టడీకి బెంగళూరు కోర్టు అనుమతించింది. పాక్ అనుకూల నినాదాలు చేసిన కేసులో ముగ్గురు అనుమానితులను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన తరవాత, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ, అసెంబ్లీ ఆవరణలో కొందరు నినాదాలు చేయడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్ అనుకూల నినాదాలపై ఇప్పటికే కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అన్నీ ఆధారాలు సేకరించిన తరవాతే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ హెచ్.టి.శేఖర్ వెల్లడించారు.ఆ ముగ్గురిపై న్యాయపరమైన చర్యలుంటాయని ఆయన చెప్పారు.
అరెస్టైన వారిలో ఢిల్లీకి చెందిన ఇల్టాజ్, బెంగళూరుకు చెందిన మునావర్, బ్యాడిగి ప్రాంతానికి చెందిన మహ్మద్ షఫీగా గుర్తించారు. రాజ్యసభ సభ్యుడు నసీర్ హుసేన్ విజయం సాధించినట్లు ప్రకటించగానే ఆ ముగ్గురూ పాక్ అనుకూల నినాదాలు చేసినట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ద్వారా బయటపడిందని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర తెలిపారు.