సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గతంలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. కేసులన్నీ కలిపి విచారించాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆ కేసుపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.
భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం కింద ఉన్న హక్కులను దుర్వినియోగం చేశారు. మరలా రక్షణ కావాలంటూ మీరే కోర్టును ఆశ్రయించారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఒక మంత్రిగా ఉన్నారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి విపరిణామాలకు దారితీస్తాయో, మీకు తెలియదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను మార్చి 15కు వాయిదా వేసింది.
2023 సెప్టెంబరులో మంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా అప్పట్లో పెద్ద దుమారం రేగింది. పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.కేసులన్నీ కలిపి విచారించాలని మంత్రి ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు