SFI public trial leaves a student injured and
hospitalized
కేరళ కోళికోడ్ జిల్లా పయ్యోలి పట్నంలో వామపక్ష
విద్యార్థి సంస్థ ఎస్ఎఫ్ఐ, బహిరంగ విచారణ నిర్వహించి ఒక విద్యార్ధిని తీవ్రంగా
హింసించింది. ఫిబ్రవరి 18న వేయనాడ్ వెటర్నరీ కాలేజీలో సిద్ధార్ధ అనే యువకుడు
అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ ఘటనపై ఎస్ఎఫ్ఐ, మార్చి 1న ఈ విచారణ చేపట్టింది.
సిద్దార్ధ మృతికి సంబంధించి తాము అనుమానించిన, కోయిలాండీ
టౌన్‌కి చెందిన విద్యార్ధి సీఆర్ అమల్పై ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు దాడి చేసారు. అమల్
కళ్ళకు, ముక్కు మీద తీవ్రగాయాలయ్యాయి. అతన్ని కోళికోడ్‌లోని వైద్యకళాశాల
ఆస్పత్రిలో చేర్చారు. ఎస్ఎఫ్ఐ స్థానిక కార్యదర్శి సుమారు 20మంది వ్యక్తులతో తనను
చుట్టుముట్టి చితక్కొట్టాడని అమల్ ఆరోపించాడు.
అమల్పై దాడి మార్చి 1 మధ్యాహ్నం జరిగింది. ఆ
రోజు సుమారు 20మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు తనను బైటకు తీసుకువెళ్ళారనీ, కాలేజీకి
కొంత దగ్గరలో తనను నిర్బంధించారనీ, చితక్కొట్టారనీ అతను వివరించాడు. తమ కళాశాలలో
ఎస్ఎఫ్ఐ చైర్మన్, తన తరగతిలోనే చదువుతున్న విద్యార్ధి అభయ్కృష్ణ నేతృత్వంలో ఆ
సంస్థ కార్యకర్తలు తన మీద దాడిచేసారని చెప్పాడు. ఆ దాడిలో అమల్ ఛాతీ, ముక్కు, తల
మీద విపరీతంగా గుద్దారు.
వారి దెబ్బలకు ముక్కు నుంచి రక్తం విపరీతంగా
కారింది. కళ్ళుతిరిగి పడిపోయే పరిస్థితిలో ఉన్నా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అతన్ని బలవంతంగా
నించోబెట్టారు.
అమల్ స్నేహితులు అతన్ని ఆస్పత్రికి
తీసుకువెళ్ళారు. దాడులు చేసిన వారు అక్కడికి కూడా వెళ్ళారు. అమల్‌కు తగిలిన
గాయాలకు కారణం యాక్సిడెంట్ అని రాయాలంటూ ఆస్పత్రి రిసెప్షనిస్ట్‌ని బెదిరించారు.
ఆస్పత్రి వైద్యులు అమల్‌ను వైద్యకళాశాలకు ఆస్పత్రికి పంపించారు. దుండగులు అక్కడకు
కూడా వెళ్ళి వైద్యులకు తప్పుడు సమాచారం ఇచ్చారు.
అమల్ ఇంటికి చేరుకునేసరికి అతనికి నెప్పి
విపరీతంగా పెరిగిపోయింది. దాంతో అతను తనకు తగిలిన గాయాల గురించి తల్లిదండ్రులకు
చెప్పాడు. ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంస్థ అమల్లో ఉన్న చాలావరకూ కళాశాలల్లో ఇలాంటి వేధింపులు,
హింస తప్పనిసరిగా ఉంటాయని అమల్ తోటి విద్యార్ధులు వెల్లడించారు.
ఇటువంటిదే మరో ఘటన
పాలక్కాడ్ జిల్లాలో జరిగింది. అక్కడ పట్టంబి సంస్కృత కళాశాలలో పలువురు
విద్యార్ధులను ఎస్ఎఫ్ఐ మూకలు చితగ్గొట్టేసాయి. అలా కేరళ నలుమూలల్లోనూ ఎస్ఎఫ్ఐ తన
నిజమైన రంగును తనే బైటపెట్టుకుంటోంది.