వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని మోదీ, ఆదిలాబాద్‌లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ప్రచారం కాదని, వికసిత్ భారత్ కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడిందని, ప్రస్తుత కాంగ్రెస్ వారితో కుమ్మక్కైందని ప్రధాన మోదీ విమర్శించారు.
ఇది ఎన్నికల సభ కాదు. అభివృద్ధి ఉత్సవమన్న ప్రధాని మోదీ, 15 రోజుల్లో 5 ఎయిమ్స్ ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఓ ఆదివాసీ మహిళను బీజేపీ రాష్ట్రపతిని చేసిందన్నారు. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయన్నారు. గిరిజనుల కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలంగాణకు మెగాటెక్స్‌టైల్ పార్క్ కేటాయించారు. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.