ఒడిషాలోని ప్రసిద్థ పుణ్యక్షేత్రం పూరీ ఆలయంలో అన్యమతస్తులు చొరబడ్డారు. బంగ్లాదేశ్ జాతీయులు కొందరిని ఒడిషాలోని పూరీ ఆలయంలో చూశామని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హిందూయేతరులు దేవాలయంలోకి చొరబడినట్లు తమకు ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు.ఇద్దరి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుశీల్ మిశ్రా వెల్లడించారు. హిందువులకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశం ఉందని ఆయన గుర్తు చేశారు. హిందువులు కాని వారు దేవాలయంలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు హిందువని, పాస్పోర్ట్ ద్వారా తెలుసుకున్నారు. మరో వ్యక్తి గురించి తెలియాల్సి ఉంది. మొత్తం నలుగురు ఆలయంలోకి ప్రవేశించారని అనుమానిస్తున్నారు.