ఢిల్లీ లిక్కర్ స్కాంలో తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు ఎనిమిది సార్లు సమన్లు ఇచ్చిన తరవాత సీఎం కేజ్రీవాల్ ఎట్టకేలకు దిగివచ్చారు. మార్చి 12 తరవాత ఈడీ అధికారుల ముందు హాజరవుతానని ఆయన సమాధానం పంపారు. మార్చి 4లోపు హాజరు కావాల్సి ఉండగా, ఈడీ అన్యాయంగా తనను విచారణకు పిలుస్తున్నారంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. మార్చి 12లోపు హాజరు కాగలనని తాజాగా సమాధానం ఇచ్చారు.
ఢిల్లీ మద్యం పాలసీ 2021-22 తయారీలో ఆప్ నేతలు వారికి అనుకూలంగా తయారు చేసుకున్నారంటూ ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హాజరు కావాలంటూ గత ఏడాది డిసెంబరు 22 నుంచి ఇప్పటి వరకు ఈడీ ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసింది. అయినా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒకసారి మినహా హాజరు కాలేదు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఆప్ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ తిహార్ జైలులో ఉన్నారు. గత ఏడాది అక్టోబరులో అప్పటి ఢిల్లీ మాజీ సీఎం సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తరవాత ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.