ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్తూపాన్ని చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్ ఆవిష్కరించారు. మూడు రాష్ట్రాల పోలీసు బలగాలను గడగడలాడించిన స్మగ్లర్ వీరప్పన్ అభిమానిగా ముద్రపడ్డ భరత్, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నారు. ఓ స్మగ్లర్ స్మారక స్తూపం ప్రారంభించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని కాకర్లవంకలో కొందరు ఇటీవల వీరప్పన్ స్మారక స్తూపం నిర్మించారు. స్మారక స్తూపం, దానికి ఏర్పాటు చేసిన జెండాను వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ప్రారంభించడం చర్చకు దారితీసింది. వీర్పన్ స్మారక స్తూపం ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు వైసీపీ సీనియర్ నేతలు కూడా పాల్గొనడం వివాదాస్పదంగా మారింది.