తమ డిమాండ్ల సాధనకు ఉత్తరాది రాష్ట్రాల రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమాన్ని ఉద్ధృతం చేయాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. ఈ నెల ఆరో తేదీ నుంచి కార్యాచరణ ప్రకటించారు. మార్చి 6న ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని, 10న రైల్‌రోకో నిర్వహించాలని నిర్ణయించారు.ఛలో ఢిల్లీ కార్యక్రమంలో ఇటీవల చనిపోయిన రైతు శుభకరణ్ సింగ్ కుటుంబాన్ని సంఘం నేతలు పరామర్శించారు. ఢిల్లీలో నిరసన మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు.
పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడంతోపాటు, తమ డిమాండ్లు పరిష్కరించే వరకు నిరసన విరమించేది లేదని తేల్చి చెప్పారు. శంభు, ఖానౌరీ సరిహద్దుల వద్ద ఇప్పటికే రైతులు నిరసన తెలుపుతున్నారు. మార్చి 6వ తేదీ చేపట్టబోయే నిరసనల్లో రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు