పాకిస్తాన్
ప్రధానిగా పీఎంఎల్-ఎన్ నేత షెహబాజ్ షరీఫ్ రెండోసారి ఎన్నికయ్యారు. పీఎంఎల్-ఎన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న షెహబాజ్‌ను.. ప్రధానిగా జాతీయ
అసెంబ్లీ ఎన్నుకుంది.
ఆదివారం
నిర్వహించిన ఓటింగ్‌లో మొత్తం 336 ఓట్లకుగానూ 201 ఓట్లు షెహనాజ్ కు లభించగా పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI) పార్టీ నుంచి పోటీ పడిన ఒమర్ అయూబ్‌ఖాన్‌కు
92
ఓట్లు మాత్రమే లభించాయి.
ప్రధాని అయ్యేందుకు 169 మంది సభ్యుల మద్దతు అవసరం.
ఓటింగ్
సందర్భంగా పీటీఐ మద్దతుగల చట్టసభ్యుల నినాదాలతో పార్లమెంటులో గందరగోళం ఏర్పడింది. షెహబాజ్ సోమవారం అధ్యక్ష భవనంలో పాకిస్తాన్ 33వ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు.
పీఎం
ఎన్నిక సందర్భంగా సున్ని ఇతిహద్ కౌన్సిల్ సభ్యులు ఆందోళనకు దిగి నినాదాలు చేశారు. గందరగోళం
మధ్యే షెహనాజ్ ను ప్రధానిగా స్పీకర్ సర్దార్ ఆయాజ్ సాదిక్
ప్రకటించారు.
2022
ఏప్రిల్‌లో ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత మొదటిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన షరీఫ్..
గతేడాది ఆగస్టు వరకు సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహించారు.
పలు
వివాదాల మధ్య పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు
జరిగాయి. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పార్టీ 75 స్థానాల్లో గెలవగా, భూట్టో పార్టీ 54
సీట్లు గెలుచుకుంది. ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ కు 17 సీట్లు
దక్కాయి. దీంతో ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తరఫున స్వతంత్రంగా పోటీచేసిన అభ్యర్థుల్లో 93 మంది
గెలిచారు.