పాకిస్థాన్లో కీలక ఉగ్రవాది అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెహ్రీక్ ఉల్ ముజాహిద్దీన్ సంస్థకు చీఫ్గా వ్యవహరిస్తోన్న షేక్ జమీల్ ఉర్ రహ్మాన్ ఖైబర్, పాక్లో అబొటాబాద్లో అనుమానాస్పదంగా చనిపోయినట్లు ఆదేశ స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. హిజ్బుల్, లష్కరే సంస్థలను ఇతను సహకారం అందిస్తోన్నట్లు భారత్ గుర్తించింది.
రెండేళ్ల కిందటే ఇతన్ని భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. జమీల్ స్వస్థలం కశ్మీర్లోని పుల్వామా కాగా, సరిహద్దులు దాటి పాక్ పారిపోయాడు. పాక్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఆదేశాల మేరకు జమీల్ పనిచేస్తున్నట్లు భారత్ గుర్తించింది. ఇతని మరణంతో ఉగ్రకార్యకలాపాలు తగ్గాయని భారత్ భావిస్తోంది.
ఇటీవల కాలంలో అనేక మంది కీలక ఉగ్రవాదులు అనుమానాస్పదంగా మృతిచెందారు. ముంబై పేలుళ్ల సూత్రదారి, లష్కరే ఉగ్రవాది అజామ్ చీమా ఇటీవల మృత్యువాతపడ్డారు. గత ఏడాది డిసెంబరులో లష్కరే కమాండర్ అడ్నాన్ అహ్మద్ అకా కూడా కరాచీలో జరిగిన కాల్పుల్లో చనిపోయాడు. షహీద్ కూడా హత్యకు గురయ్యాడు.