తిరుమల
తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు
ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఈ వేలం వేయాలని
నిర్ణయించింది. మార్చి 15 నుంచి
22 వరకు
ఈ – వేలం నిర్వహించనున్నారు.
ఆర్ట్
సిల్క్ ధోతీలు, ఉత్తరీయాలు, టర్కీ
టవళ్లు, లుంగీలు, దుపట్టాలు, శాలువలు, బెడ్
షీట్లు, నాప్
కిన్స్, హ్యాండ్
కర్చీఫ్లు, పంజాబి డ్రెస్ మెటీరియల్స్, జంకాళాలు, కార్పెట్లు, గొడుగులను
భక్తులు కానుకలుగా సమర్పించారు.
మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తికి తిరుపతిలోని
టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429
నంబరులో గానీ, www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించాలని టీటీడీ తెలిపింది.
లడ్డూ
ప్రసాద ధర తగ్గింపు వినతిపై ఈవో స్పష్టత
తిరుమల
శ్రీవారి లడ్డూప్రసాదాల ధరలను తగ్గించే ఆలోచన లేదని ఈవో ధర్మారెడ్డి స్పష్టం
చేశారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఓ భక్తుడి అడిగిన ప్రశ్నకు ఆయన ఈవిధంగా
సమాధానం చెప్పారు. రేటు తగ్గించడానికి అవకాశం లేదన్నారు.