తిరుపతి
శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా
కొనసాగుతున్నాయి. మూడోరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీదేవి,
భూదేవి సమేత శ్రీనివాసుడు బకాసుర వధ అలంకారంలో ముత్యపుపందిరి
వాహనం పై నుంచి భక్తులకు అభయమిచ్చారు.
నాలుగో
రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనం నుంచి
భక్తులకు దర్శనమిచ్చారు. కళ్యాణ వేంకటేశ్వరస్వామివారు, శ్రీదేవి, భూదేవి సమేతంగా రాజమన్నార్
అలంకారంలో తిరువీధుల్లో విహరించారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
దేవలోకంలోని ఐదు దేవతా చెట్లలో కల్పవృక్షం ఒకటి. మందారం, పారిజాతం, సంతానం,
కల్పవృక్షం, హరిచందన అనే ఐదు రకాల దివ్య వృక్షాలు దేవంలోకంలో ఉన్నాయని పురాణాల్లో
పేర్కొన్నారు.
తిరుపతి కపిలతీర్థంలో శ్రీకపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోలాహలం
నెలకొంది. శనివారం రాత్రి శ్రీ కపిలేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై విహరించి
భక్తులను అనుగ్రహించారు. నేటి(ఆదివారం) ఉదయం భూత వాహనంపై నుంచి దర్శనమిచ్చి తిరువీధుల్లో
విహరించారు. రాత్రికి సింహ వాహనాన్ని అధిరోహించనున్నారు.