మద్యం మాఫియా డాన్ పాంటీ చంద్రకు చెందిన రూ.400 కోట్ల ఫాం హౌస్‌ను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ కూల్చి వేసింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఫాం హౌస్ నిర్మించారని డీడీఏ అధికారులు వెల్లడించారు. లిక్కర్ డాన్‌గా పేరున్న పాంటీ చంద్ర ఆలియాస్ గుర్దీప్సింగ్కు చెందిన పది ఎకరాల్లో నిర్మించిన విలాసవంతమైన రూ.400 కోట్ల విలువైన భవనాన్ని శుక్రవారం నాడు కూల్చివేసినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ఎలాంటి అనుమతులు లేకుండా ఫాం హౌస్ నిర్మించినట్లు అధికారులు ప్రకటించారు. శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు భారీ యంత్రాలతో ఫాం హౌస్‌లో నిర్మించిన భవనాలను కూల్చివేశారు. అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను గత జనవరి మాసంలోనూ కూల్చివేసినట్లు అధికారులు గుర్తుచేశారు.