బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో ఇటీవల చోటు చేసుకున్న పేలుడుపై కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఇప్పటికే కర్ణాటక పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇడ్లీ తిని కుక్కుర్ బాంబు ఉన్న బ్యాగ్‌ను వదిలేసి వెళ్లిపోయిన వ్యక్తికి సంబంధించిన సీసీ టీవీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదు కి.మీ పరిధిలోని దాదాపు 300 సీసీటీవీల ఫుటేజీ పరిశీలించడం ద్వారా పోలీసులు అనుమానితుడి వీడియో విడుదల చేశారు.
తెల్లటోపీ, నోటికి మాస్కుతో రామేశ్వరం కేఫ్ దిశగా వెళ్లడం, వచ్చేప్పుడు బ్యాగు లేకుండా వెళ్లడంతో అతనిపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టైమర్ బాంబు అమర్చడం ద్వారా పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది.
రామేశ్వరం కేఫ్‌లో పేలుడు తరవాత స్వాధీనం చేసుకున్న పదార్థాలను విశ్లేషించిన నిపుణులు ఆడీఎక్స్ ఉపయోగించినట్లు గుర్తించారు. కుందేనహళ్లి నుంచి బీఎంటీసీ బస్సులో ప్రయాణం చేసి రామేశ్వరం కేఫ్‌కు అనుమానితుడు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని సీఎం సిద్దరామయ్య కూడా పరిశీలించారు. ఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో పరామర్శించారు.రెండు సంవత్సరాల కిందట కూడా కుక్కుర్ బాంబు పేలింది. ఈ రెండు ఘటనల మధ్య ఏమైనా సంబంధాలున్నాయా అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు