పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ-జనసేన
ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉన్న మహాసేన రాజేష్ అలియాస్ సరిపెళ్ళ రాజేశ్ కీలక ప్రకటన
చేశారు. పోటీ నుంచి తప్పుకుంటేనే బెటర్ అని తన యూట్యూబ్ అకౌంట్ వేదికగా
వ్యాఖ్యానించారు.
తనను అడ్డుపెట్టుకుని టీడీపీ-జనసేన కూటమికి నష్టం
చేసేలా వైసీపీ అధినేత జగన్ కుట్ర చేస్తున్నాడని రాజేష్ ఆరోపించాడు.
వైసీపీ అనుకూల
మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తున్నారన్నారు. వైసీపీలో చేరినప్పుడు
లేని అభ్యంతరాలు టీడీపీలో చేరగానే ఎందుకు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు,
పవన్ కు నష్టం జరిగే పరిస్థితి వస్తే తాను పోటీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవడానికైనా
సిద్ధమేనని వ్యాఖ్యానించారు.
మహాసేన రాజేశ్, గతంలో బ్రాహ్మణ స్త్రీలు, హిందూ
దేవుళ్ళను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారని అతడికి టికెట్ ఇవ్వడం సరికాదు అని పలువురు
నిరసన వ్యక్తం చేస్తున్నారు.
హిందు
దేవతలు, బ్రాహ్మణ స్త్రీలను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనను
తప్పుగా అర్ధం చేసుకోవద్దు అని యూట్యూబ్ చానల్ వేదికగా మహాసేన రాజేష్ కోరారు.