పశ్చిమ
బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్( TMC) ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు పెచ్చురిల్లాయని
ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలన, గాడితప్పిందని
విమర్శించారు.
పశ్చిమ
బెంగాల్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, రూ. 15 వేలకోట్ల విలువైన అభివృద్ధి
పనులు ప్రారంభించారు.
అనంతరం క్రిష్ణానగర్ బహిరంగ సభలో మమతా బెనర్జీ
ప్రజావ్యతిరేకపాలనపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజామద్దతుతో అధికారంలోకి వచ్చిన టీఎంసీ వారికి
ద్రోహం చేస్తోందని ఆరోపించిన మోదీ, దౌర్జన్యాలకు కేంద్రంగా టీఎంసీ పాలన మారిందని
వ్యాఖ్యానించారు. టీఎంసీ అంటేనే దౌర్జన్యాలు, కుటుంబ పాలన, ద్రోహానికి ప్రతిరూపం అన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ పాలన పట్ల విసుగు చెందారన్నారు.
రానున్న
పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 పైచిలుకు సీట్లు రావడం ఖాయమన్నారు. బెంగాల్
లోనూ 42 ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. బెంగాల్ ప్రజలు ఇచ్చిన విశ్వాసం
ఆధారంగా తాను వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిపారు.
పేదలను
పేదలుగా ఉంచడం ద్వారా టీఎంసీ రాజకీయ పబ్బం గడపాలనకుంటుందని విమర్శించిన మోదీ,
సందేశ్ ఖాలీ ఘటనపై మమతా బెనర్జీ నోరుమెదకపోవడాన్ని తప్పుబట్టారు. ఆడబిడ్డలపై
ఆఘాయిత్యాలు జరుగుతుంటే మమతా బెనర్జీ మాత్రం చలించడం లేదన్నారు.
పర్యటనలో
భాగంగా దామోదర్-మొహిశిలా, రాంపూర్హాట్, మురారై, బజార్సౌ-అజిమ్గంజ్, అజిమ్గంజ్-ముర్షిదాబాద్
రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకింతం చేశారు. నాడియా జిల్లాలోని కళ్యాణి లో
నిర్మించిన ఎయిమ్స్ ను ప్రధాని ప్రారంభించారు.