ముంబై
బాంబు పేలుళ్ల (26/11) కీలక సూత్రధారి, లష్కరే తోయిబా (ఎల్ఈటీ) సీనియర్
కమాండర్ అజామ్ చీమా (Azam Cheema) గుండెపోటుతో చనిపోయాడు. పాకిస్తాన్లోని ఫైసలాబాద్
లో మరణించినట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది.
అజామ్,
పలు మారణహోమ కుట్రల్లో మాస్టర్ మైండ్ గా ఉన్నాడు. 2006లో ముంబై
రైళ్లలో జరిగిన బాంబు పేలుడులో అతడి
హస్తం ఉన్నట్లు తేలింది. నాటి దుర్ఘటనలో 188 మంది ప్రాణాలు కోల్పోగా 800 మంది గాయపడ్డారు.
పాకిస్తాన్
కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబై కేంద్రంగా కుట్రకు
పాల్పడ్డారు. నవంబరు 26, 2008న బాంబులు పేల్చి 188 మందిని
పొట్టనబెట్టుకున్నారు. కొలాబా సముద్ర తీరం నుంచి ముంబైలోకి ప్రవేశించిన ముష్కర
ముఠా, గ్రూపులుగా విడిపోయి అనేక చోట్ల
విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాదాపు 60 గంటల పాటు సాగిన కాల్పుల్లో 166 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు అమెరికా
పౌరులు కూడా ఉన్నారు.
ఉగ్రవాదులకు అజామ్ శిక్షణ ఇచ్చాడని అమెరికా నిఘా వర్గాలు
వెల్లడించడంతో అతడి పేరును మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టు లిస్ట్ లో చేర్చారు.