RSS Annual Pratinidhi Sabha Meeting in Nagpur from 15 to 17 March
రాష్ట్రీయ స్వయంసేవక్
సంఘ్ వార్షిక అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు మార్చి 15 నుంచి 17 వరకూ జరుగుతాయి.
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్ర నాగపూర్‌లోని రేషిమ్‌బాగ్‌లో ఆ
సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. 2023-24 సంవత్సరంలో సంఘం చేపట్టిన సామాజిక,
సేవా, తదితర కార్యక్రమాల గురించి ఆ సమావేశాల్లో సమీక్షిస్తారు.
ఇంకా, 2024-25
సంవత్సరంలో సంఘం అజెండా, ప్రణాళికల గురించి కూడా విస్తృతంగా చర్చిస్తారు. ఈ
యేడాదిలో ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ పర్యటనలు, అఖిల భారతీయ కార్యకర్తల పర్యటనల
గురించి కూడా చర్చలు జరుగుతాయి. స్వయంసేవకుల శిక్షణకు సంబంధించిన సంఘశిక్షావర్గ
కొత్త ప్రణాళిక అమలు గురించి కూడా చర్చిస్తారు. సంఘం పని చేసే కార్యక్షేత్రాలను
విస్తరించే వ్యూహాల గురించి కూడా చర్చలు జరుగుతాయి.
సంఘం స్థాపించి వచ్చే
2025కు వందేళ్ళు పూర్తవుతాయి. ఆ సందర్భంగా చేపట్టవలసిన కార్యాచరణ గురించి ప్రస్తావనలు
ప్రముఖంగా ఉంటాయి. వీటితోపాటు దేశంలో ప్రస్తుతం ఉన్న స్థితిగతుల గురించి
చర్చిస్తారు. కీలకాంశాలపై తీర్మానాలు చేసి ఆమోదిస్తారు.
సంఘం ప్రతినిధి సభ
ప్రతీయేడాదీ దేశంలోని వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహిస్తారు. ప్రతీ మూడో యేడాదీ
నాగపూర్‌లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో 45 ప్రాంతాల నుంచి 1500మంది ప్రతినిధులు
పాల్గొంటారు. పూజనీయ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్‌జీ, సర్‌కార్యవాహ
దత్తాత్రేయ హొసబలే, సహ సర్‌కార్యవాహలు, అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు, క్షేత్ర,
ప్రాంత కార్యకారిణి సభ్యులు, విభాగ్ ప్రచారక్‌లు, ఇంకా సంఘం నుంచి స్ఫూర్తి పొంది
సామాజిక క్షేత్రంలో పనిచేస్తున్న సంస్థల నుంచి ఆహ్వానించబడిన ప్రతినిధులు ఈ
సమావేశాలకు హాజరవుతారు.