ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతోన్న యుద్ధం నేపథ్యంలో గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. ఆహారం కోసం గుంపులుగా పోగైన జనాలపై ఐడీఎఫ్ బాంబు దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ప్రజల ఆకలి తీర్చేందుకు రోజుకు 500 ట్రక్కుల ఆహారం కావాల్సి ఉండగా, కేవలం 97 ట్రక్కులు మాత్రమే దేశంలోని ప్రవేశిస్తున్నాయని బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు.
గాజాలో ప్రజల ఆకలి తీర్చేందుకు అమెరికా సిద్దంగా ఉన్నట్లు బైడెన్ ప్రకటించారు. హెలికాఫ్టర్ల ద్వారా ఆహార పొట్లాలు జారవిడుస్తామని ఆయన ప్రకటించారు. గాజా ప్రజలకు మానవతా సాయం అవసరం ఉందని, అది అందించేందుకు అమెరికా సిద్దంగా ఉందని బైడెన్ స్పష్టం చేశారు.
గాజాలో మానవతా సాయం పెరగాలంటే ఈజిప్టు సరిహద్దు రఫా చెక్‌పోస్ట్ తెరుచుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. గాజాలో చిన్నారులు పోషకాహార లోపంతో చనిపోతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రోజుల తరబడి అక్కడి ప్రజలు పస్తులుంటున్నారని ఐరాస తెలిపింది. ఆకలి తట్టుకోలేక పశువుల దాణాను ఆహారంగా తీసుకుంటున్నారని ఐరాస వెల్లడించింది.