Indian Classical Dancer Shot Dead in the US
భారతదేశానికి చెందిన శాస్త్రీయనాట్య కళాకారుడు
అమర్నాథ్ ఘోష్ అమెరికాలో హత్యకు గురయ్యాడు. ఆ విషయాన్ని అతని స్నేహితురాలు, టీవీ
నటి దేవొలీనా భట్టాచార్జీ వెల్లడించింది.
అమెరికాలో మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయీ
నగరంలో మంగళవారం సాయంత్రం వాకింగ్‌కు వెళ్ళిన సమయంలో దుండగులు అతన్ని పలుమార్లు
కాల్చి చంపారని దేవొలీనా తెలియజేసింది. ఆ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహాయం
చేయాలని ఆమె అర్ధించింది.
‘‘నా స్నేహితుడు అమర్నాథ్ ఘోష్‌ను అమెరికాలోని
సెయింట్ లూయీస్ అకాడెమీ పరిసర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం కాల్చి చంపారు. అతను
తమ కుటుంబంలో ఒక్కడే సంతానం. అతని తల్లి మూడేళ్ళ క్రితం చనిపోయింది. తండ్రి అతని
బాల్యంలోనే చనిపోయారు. అమర్నాథ్ను చంపింది ఎవరు, చంపడానికి కారణాలేంటి అన్న
విషయాలు ఇంకా తెలియరాలేదు. బహుశా అతని గురించి పోరాడడానికి, కొందరు స్నేహితులు
తప్ప అతని కుటుంబ సభ్యులు ఎవరూ బ్రతికిలేరు’’ అని ఆమె సోషల్ మీడియాలో
రాసుకొచ్చింది.
‘‘అమెరికాలోని కొందరు మిత్రులు మృతదేహాన్ని
తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ దానిగురించి అప్డేట్ ఏమీ లేదు.
అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం ఈ విషయాన్ని పట్టించుకుని పరిశీలించాలి. కనీసం,
అతని హత్యకు కారణం ఏమిటో మనకు తెలియాలి’’ అని ఆమె పేర్కొంది.
అమర్నాథ్ ఘోష్, కోల్‌కతా నివాసి. చెన్నై
కళాక్షేత్ర అకాడెమీ పూర్వవిద్యార్ధి అయిన అమర్నాథ్ భరతనాట్యం, కూచిపూడి సహా
నాలుగు రకాల నాట్యరీతుల్లో అసాధారణ ప్రతిభ కలిగిన కళాకారుడు. అమెరికా సెయింట్ లూయీ
లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో నాట్యంలో ఎంఎఫ్ఎ కోర్సు అభ్యసిస్తున్నాడు. కూచిపూడిలో
తన ప్రతిభకు గాను జాతీయ స్కాలర్షిప్ గెలుచుకున్నాడు. అతను బొబితా దే సర్కార్, ఎంవి
నరసింహాచారి, పద్మశ్రీ అడయార్ కె లక్ష్మణ్ వంటివారి దగ్గర శిక్షణ తీసుకున్నాడు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు