శ్రీశైల
క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల రెండో రోజైన నేటి రాత్రికి ఆదిదంపతులకు
భృంగి వాహన సేవ జరగనుంది. అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు పూజలు
నిర్వహించిన అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల
సందర్భంగా శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ధ్వజారోహణ, భేరి పూజ చేసి ధ్వజపతాకాన్ని ఆవిష్కరించారు.
అంతకు ముందు వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవాలకు నాంది వచనం పలికారు.
బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి పర్యవేక్షణలో, చండీశ్వరుని
నాయకత్వంలో ఈ క్రతవు జరిగింది.
శ్రీభ్రమరాంబ
సమేత మల్లేశ్వరస్వామికి శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున ఆలయ ఈవో ఎంవీ నాగేశ్వరరావు
దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ
శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంవారు రేపు(ఆదివారం) ఆదిదంపతులకు
పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
శ్రీగిరికి
శివదీక్షాస్వాములు పెద్దసంఖ్యలో పాదయాత్రగా వస్తున్నారు. వీరికి ఆలయ అధికారులు
స్పర్శదర్శనం కల్పిస్తున్నారు.