తిరుపతి
శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీ కల్యాణ
వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కలియుగ
దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు శుక్రవారం రాత్రి సరస్వతి దేవి అలంకారంలో భక్తులను
కటాక్షించారు. హంస వాహనంపై విహరిస్తూ
ప్రజలకు అభయమిచ్చారు.
నాలుగు మాడ వీధుల్లో విహరించిన స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో
దర్శించుకున్నారు. గోవింద నామస్మరణతో పరిసరాలు మార్మోగాయి.
స్వామి
ఊరేగింపు ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తలు
భజనలు చేయడంతో పాటు కోలాటాలు ఆడారు. మంగళవాయిద్యాల
నడుమ వాహనసేవ కొలాహలంగా సాగింది.
బ్రహ్మోత్సవాల్లో
భాగంగా నేటి ఉదయం స్వామివారు సింహా
వాహనంపై నుంచి అభయమిచ్చారు. రాత్రికి ముత్యపుపందిరి వాహన సేవ నిర్వహిస్తారు.
కపిలేశ్వురుడి
బ్రహ్మోత్సవాలు…
తిరుపతిలోని
శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. మొదటి రోజైన శుక్రవారం రాత్రి, హంస వాహనంపై ఆది
దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారు. వారి వల్లనే
అష్టాదశ విద్యలు పరిణమించాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కపిలాది యోగీశ్వరుల మానస
సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు.