కేంద్ర న్యాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 80 దాటిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకుంది. దాన్ని 85 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిబంధనావళి 1961 రూల్ 27ఏ క్లాజ్ (ఇ)ని సవరిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో 80 సంవత్సరాలు దాటిన వారందరికీ పోస్టల్ ఓటు వేయడానికి వీలుంది. ఇకపై దాన్ని 85 సంవత్సరాలకు పెంచారు.
పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం అవుతున్నాయని పలు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం, న్యాయశాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.