స్టాక్ మార్కెట్లలో జోష్ కొనసాగింది. లాభాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. దేశ వృద్ధి రేటు అంచనాలను మించిపోతుందనే సంకేతాలు రావడంతో పెట్టుబడిదారులు భారీగా స్టాక్స్ కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు రావడంతో బుల్‌రన్ కొనసాగింది.
లాభాలతో మొదలైన సెన్సెన్స్, ముగిసే సమయానికి 1245 పాయింట్లపైగా పెరిగి 73745 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 355 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా 22338 పాయింట్ల ఆల్ టైం హై రికార్డు నమోదు చేసింది. డాలరుతో రూపాయి స్వల్పంగా బలపడి రూ.82.90 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాలార్జించాయి. ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ నష్టాల్లో ముగిశాయి. ముడిచమురు ధర స్వల్పంగా పెరిగి 83.03 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్సు గోల్డ్ రూ.2055 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.