బెట్టింగ్
యాప్ కేసు: రూ.580 కోట్ల విలువైన ఆస్తులు సీజ్
మహాదేవ్
యాప్ కేసులో రూ. 580 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. అలాగే తాజాగా
నిర్వహించిన సోదాల్లో భాగంగా అక్రమంగా దాచిన రూ. 3.64 కోట్ల నగదు స్వాధీనం
చేసుకుంది.
మహాదేవ్
బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా కోల్‌కతా, గురుగ్రామ్, దిల్లీ, ఇండోర్,
ముంబై, రాయ్‌పూర్ లో ఫిబ్రవరి 28న ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి మరికొన్ని కీలక
ఆధారాలు సేకరించారు.
ఈ కేసులో
ఛత్తీస్‌గఢ్ కు కు చెందిన బడా రాజకీయనేతలతో పాటు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు
ఆరోపణలు ఉన్నాయి. ఈడీ విచారణలో భాగంగా రోజుకో అక్రమం వెలుగులోకి వస్తోంది.
ఈ స్కామ్‌లో కీలక పాత్రధారిగా హవాలా ఆపరేటర్ హరి శంకర్ టింబరేవాల్ ఉన్నట్లు
ఈడీ విచారణలో తేలింది. కలకత్తాకు చెందిన హరి శంకర్, ప్రస్తుతం దుబాయ్ లో
ఉంటున్నాడు. మహాదేవ్ యాప్ భాగస్వాముల్లో ఒకడైన హరి శంకర్ ‘స్కై ఎక్సేంజ్’ అనే మరో
బెట్టింగ్ యాప్ ను కూడా నడుపుతున్నట్లు వెల్లడైంది.
పీఎమ్‌ఎల్ఏ
చట్టం కింద అతడికి చెందిన రూ. 580.78 కోట్ల విలువైన ఆస్తిని సీజ్ చేసిన ఈడీ, రూ.
1.86 కోట్ల నగదు స్వాధీనం చేసుకుది. అలాగే రూ. 1.78 కోట్ల విలువ చేసే కొన్ని వస్తువులను
కూడా సోదాల సందర్భంగా సీజ్ చేశారు.
మహాదేవ్
బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేసిన ఈడీ,
బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదిచిన అక్రమ సొమ్మును రాజకీయనేతలు, ఉన్నతాధికారులకు
లంచంగా అందజేసినట్లు తేల్చింది.
ఈకేసుకు
సంబంధించి ఇప్పటికే రెండు ఛార్జిషీట్లను న్యాయస్థానంలో దాఖలు చేసిన ఈడీ, సౌరభ్
చక్రధర్, రవి ఉప్పల్ పై కేసు నమోదు చేసింది. దాదాపు రూ. 6 వేల కోట్లు ఈ యాప్ మాటున చేతులుమారినట్లు దర్యాప్తు సంస్థ
ప్రాథమిక విచారణలో తేలింది.