Three arrested for coercing Hindu girls to have relation with Muslims
ఇద్దరు హిందూ బాలికలను ఇస్లాంలోకి మారాలంటూ
బలవంతం చేసిన సంఘటన రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో వెలుగు చూసింది. బాధిత బాలికలు ఆల్వార్‌లోని
కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 27న ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన బైటపడింది. బాధిత
బాలికలిద్దరూ అక్కాచెల్లెళ్ళు. బాధిత బాలికలిద్దరూ ఈ ఘటన గురించి ఇలా చెప్పారు…
కాజల్ అలియాస్ బబితా జాతవ్, సకీనా మేవ్ అనే
ఇద్దరు నిందితులు ఒక ఇంట్లో అద్దెకుండేవారు. వసీమ్ అనే ముస్లిం యువకుడితో స్నేహం
చేయాలంటూ వారిద్దరూ బాధితులపై నిరంతరాయంగా ఒత్తిడి చేసేవారు. అతనితో స్నేహం చేస్తే
డబ్బులు కానుకగా వస్తాయని, ఆర్థికంగా లాభం ఉంటుందంటూ ప్రలోభపెట్టారు. ఈ వేధింపులు,
బెదిరింపులకు అంతేలేకుండా పోయేసరికి, చట్టపరమైన జోక్యంతోనే తమకు ఆ గోల వదులుతుందని
అక్కాచెల్లెళ్ళు భావించారు. ఆ మేరకు ఫిర్యాదు చేసారు.
ఫిర్యాదు తీసుకున్న వెంటనే పోలీసులు విచారణ
ప్రారంభించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారిని విచారిస్తున్నారు. ఈ ఘటన
వెనుక పెద్ద మతమార్పడి ముఠా ఏదైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
బాధిత బాలికలు తాము ఎదుర్కొన్న కఠినమైన
పరిస్థితుల గురించి వివరించారు. వారిని వసీమ్‌తో స్నేహంగా ఉండమనడం మాత్రమే కాదు,
ఇస్లాంలోకి మతం మారి ముస్లిం యువకులను పెళ్ళి చేసుకోవాలని కూడా బలవంతపెట్టారని
చెప్పారు. అలా చేయకపోతే హింసిస్తామని కూడా బెదిరించారని బాధిత బాలికలు వివరించారు.
వసీమ్, మరికొందరు ముస్లిం యువకులు నిరంతరం
తమను వెంటాడుతూ ఉండేవారని, తమతో స్నేహం చేయాలంటూ ఒత్తిడి చేసేవారనీ ఆ బాలికలు
చెప్పారు. వారి ఆర్థిక దుస్థితిని ఆసరాగా తీసుకుని నిందితులు ఉద్దేశపూర్వకంగా బహుమతులు,
డబ్బులు ఇవ్వడం ద్వారా ఆ బాలికలను ప్రలోభపెట్టడానికి, వారిని లోబరుచుకోడానికీ
ప్రయత్నించారు.
బాధితురాళ్ళకు అవసరమైన అండదండలు అందిస్తామని, వారికి
తగిన కౌన్సిలింగ్ ఇప్పిస్తామనీ డీఎస్పీ ఆనంద్ శర్మ వెల్లడించారు. ఈ కుట్రలో
ఇంకెవరైనా నేరస్తులున్నారేమో విచారిస్తామన్నారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు