Opposition Alliance
Deals Seat Sharing in Maharashtra
2024 లోక్సభ ఎన్నికలకు మహారాష్ట్ర
ప్రతిపక్ష కూటమి ‘మహా వికాస్ ఆఘాడీ’లోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. అధికారిక
ప్రకటన మాత్రం ఒకట్రెండు రోజుల్లో వెలువడవచ్చు.
మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు
ఉన్నాయి. కుదిరిన పొత్తు ప్రకారం శివసేన (యుబిటి) 20 స్థానాల్లోను, కాంగ్రెస్ 18
స్థానాల్లోను, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లోనూ పోటీ చేస్తాయి.
కూటమిలోని చిన్న పార్టీ వంచిత్ బహుజన్ ఆఘాడీ
అనే పార్టీకి, శివసేన (యుబిటి) తమకు కేటాయించిన సీట్లలోనుంచి రెండింటిని ఇస్తుంది.
అలాగే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాజు శెట్టికి ఎన్సీపీ మద్దతునిస్తుంది.
ముంబై మహానగరంలోని 6 నియోజకవర్గాల్లో శివసేన
(యుబిటి) పోటీ చేసే 4 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ నాలుగింటిలో ముంబై ఈశాన్యం
టికెట్ వంచిత్ బహుజన్ ఆఘాడీ పార్టీకి కేటాయించే అవకాశాలున్నాయి.
గతవారం 39 స్థానాలపై చర్చలు జరిగాయి.
ముంబై దక్షిణ మధ్య, ఆగ్నేయ స్థానాలు తమకే కావాలని కాంగ్రెస్, ఉద్ధప్ పట్టు
పట్టారు. ఆ సమస్య ఎలా పరిష్కారమైందో తెలియరాలేదు.
2019 ఎన్నికల్లో శివసేన 23 స్థానాల్లో
పోటీ చేసి 18చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 25చోట్ల పోటీ చేసి ఒకే ఒక్క స్థానంలో
గెలవగలిగింది. ఎన్సీపీ 19చోట్ల పోటీ చేసి 4 గెలుచుకుంది. ఇక బీజేపీ 25 స్థానాల్లో
పోటీ పడి 23 గెలుచుకుంది.