తిరుమల
శ్రీ వేంకటేశ్వర
ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు మరియు
మొబైల్ ఫోన్లను ఈ వేలం వేయనున్నారు. మార్చి 13న
రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు.
టైటాన్,
క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, ర్యాడో
కంపెనీల వాచీలతో పాటు ఐ ఫోన్లు,
వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్స్ కానుకగా భక్తులు సమర్పించినట్లు
వెల్లడించారు. వీటిలో కొన్ని కొత్తవి కాగా మరికొన్ని ఉపయోగించినవి, పాక్షికంగా
దెబ్బతిన్నవి కూడా ఉన్నాయన్నారు. 23 లాట్ల
వాచీలు, 27 లాట్ల మొబైల్స్ ను వేలం వేయనున్నారు..
మరిన్ని వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్
కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా, లేదా 0877-2264429
నంబరుకు ఫోన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. www.tirumala.org,www.konugolu.ap.gov.in
ను సంప్రదించి వివరాలు
తెలుసుకోవచ్చు అని టీటీడీ తెలిపింది.
తిరుమలలో
మార్చి లో విశేష పర్వదినాలు
తిరుమలలో
మార్చి 6, 20న
సర్వ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయనున్నారు.
మార్చి 20
నుంచి 24 వరకు
శ్రీవారి తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. మార్చి 25న
తుంబురు తీర్థ ముక్కోటి, శ్రీ లక్ష్మీ జయంతి పర్వదినాలు కావడంతో అందకు సంబంధించిన
కార్యక్రమాలు నిర్వహించనున్నారు.