మధ్యప్రదేశ్‌లోని
ఉజ్జయినిలో ‘విక్రమాదిత్య వేద గడియారం’ ఏర్పాటు చేశారు. పురాతన భారతీయ సంప్రదాయ
పంచాంగాన్ని అనుసరించి సమయాన్ని ఈ గడియారం ప్రదర్శిస్తుంది. జంతర్‌మంతర్ ప్రాంతంలో
85 అడుగుల ఎత్తున్న టవర్‌పై ఈ గడియారాన్ని
ఏర్పాటు చేశారు.
గ్రహాల
స్థితిగతులు, ముహూర్తం, జ్యోతిష గణనలు స్క్రీన్ పై చూపటం ఈ
గడియారం ప్రత్యేకత.
భారత ప్రామాణిక కాలం (IST), జీఎంటీ (GMT)లను కూడా సూచిస్తుంది. సంవత్సరం, నెల, చంద్రుడి స్థానం, శుభ సమయం, నక్షత్రం, సూర్య, చంద్ర గ్రహణాల వివరాలు కూడా ఈ గడియారం
ద్వారా తెలుసుకోవచ్చు. సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం ఆధారంగా సమయాన్ని లెక్కిస్తారు.
భారతీయ
కాల గణన విధానం అత్యంత సూక్ష్మమైనది కావడంతో పాటు, దోషరహితమైనదని టవర్ నిర్వాహకులు తెలిపారు. పురాతన భారతీయ కాల గణన
సంప్రదాయాన్ని ఈ వేద గడియారం ద్వారా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.