Tuesday, July 8, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

తెల్లవారేవరకూ బీజేపీ సమావేశం, నేడు వందమంది అభ్యర్ధులను ప్రకటించే అవకాశం

param by param
May 12, 2024, 07:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

BJP likely to announce 100 candidates for LS elections 2024

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ
సుమారు వంద మంది అభ్యర్ధుల పేర్లను ఇవాళ ప్రకటించే అవకాశముంది. నిన్న గురువారం రాత్రి
11గంటలకు ప్రారంభమైన బీజేపీ అగ్రనేతల సమావేశం ఇవాళ శుక్రవారం తెల్లవారుజామున 4
గంటల వరకూ కొనసాగింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం…. బీజేపీ
సిట్టింగ్ ఎంపీల గురించి క్షేత్రస్థాయి కార్యకర్తలు, నియోజకవర్గ ఓటర్లతో సైతం
చర్చించి అభ్యర్ధులను ఖరారు చేయాలని భావిస్తోంది. అవసరమైన చోట అభ్యర్ధులను వ్యూహాత్మకంగా
మార్చడానికి సైతం వెనుకడుగు వేయడం లేదు. ప్రజావ్యతిరేకతకు ఎలాంటి అవకాశమూ లేకుండా
వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్ధులను ఖరారు చేసే దిశగా
కసరత్తులు చేస్తోంది.
 

ఎన్నికల కమిషన్, 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూలును
విడుదల చేయడం కంటె ముందే కొంతమంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించివేయాలని బీజేపీ
భావిస్తోందని సమాచారం. ఎన్‌డీయే మిత్రపక్షాల అభ్యర్ధులను కాకుండా, బీజేపీ
అభ్యర్ధులను మాత్రమే ప్రస్తుతానికి ప్రకటించాలని బీజేపీ యోచిస్తోందట. దానివల్ల,
ప్రత్యర్ధి కూటమి అయిన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి కంటె ఒక అడుగు ముందే
ఉండాలని కమలదళం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండీ కూటమిలో ఇంకా సీట్లు పంచుకునే
విషయం ఇంకా తేలలేదు. వారికంటె ముందుగానే తమ అభ్యర్ధులను ఖరారు చేయడం ద్వారా ఒక
అడుగు ముందుండాలని బీజేపీ భావిస్తోందని సమాచారం.

గతరాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకూ
సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో ప్రధానంగా హిందీబెల్ట్ రాష్ట్రాల్లో అభ్యర్ధుల
అంశంపైనే ప్రధానంగా బీజేపీ చర్చించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్,
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్. రాజస్థాన్‌లతో పాటు ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో
బీజేపీ అభ్యర్ధులపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అలాగే దక్షిణాదిలో ఉనికి కోసం బీజేపీ
శ్రమిస్తున్న కేరళ, తెలంగాణ రాష్ట్రాల పైనా దృష్టి సారించినట్లు సమాచారం.  

ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో
ప్రాంతీయ పార్టీలతో పొత్తుల విషయం పెండింగ్‌లో ఉన్నందున అక్కడ అభ్యర్ధుల విషయాన్ని
పక్కన పెట్టారని తెలుస్తోంది. పంజాబ్‌లో అకాలీదళ్, తమిళనాడులో అన్నాడీఎంకే
పార్టీలతో సంబంధాలను పునరుద్ధరించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్‌లో
జనసేనతో పొత్తు ఉన్నా, ఆ పార్టీ తెలుగుదేశంతో కలిసిరావాలని కోరుతోంది. మరోవైపు అధికార
వైఎస్సార్‌సీపీతో కూడా పెద్ద విభేదాలేమీ లేవు. అందువల్ల ఆంధ్రాలో బీజేపీ ఎటువైపు
అడుగు వేస్తుందన్న విషయం ఆసక్తికరంగా నిలిచింది.

ఇవాళ మధ్యాహ్నం తర్వాతే జాబితా విడుదల ఉండవచ్చు.
నరేంద్ర మోదీ వారణాసి నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ మోదీ
2014లో 3.7లక్షల మెజారిటీతోను, 2019లో 4.8లక్షల ఓట్ల మెజారిటీతోనూ గెలిచారు.
మోదీని అడ్డుకోడానికి వారణాసి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రియాంకాగాంధీ వాద్రాను
మోహరిస్తుందన్న ఊహాగానాలున్నాయి. పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉన్న అమిత్ షా
గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో
ఆఢ్వాణీ, వాజ్‌పేయీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్‌ నుంచి అమిత్ షా 2019
ఎన్నికల్లో పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్ధి చతురాయిన్ చావ్డా మీద 5న్నర లక్షల
ఓట్లతో విజయం సాధించారు.

ఇంకా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్
రాజధాని లక్నో నుంచి, పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా మధ్యప్రదేశ్‌లోని
గుణ-శివపురి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
లక్నో బీజేపీ కంచుకోట. వాజ్‌పేయీ 1991 నుంచి 2004 వరకూ అక్కడినుంచి పోటీచేసి విజయం
సాధించారు, ఆయన తర్వాత రాజ్‌నాథ్ సింగ్ 2014, 2019 ఎన్నికల్లో లక్నో నుంచి
గెలిచారు. ఇంక గుణ స్థానం సిందియా కుటుంబానికి అంకితమైపోయిన స్థానం. 1952లో జరిగిన
మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికల నుంచి ఇప్పటివరకూ మొత్తం 14 సార్లూ సిందియా
రాజకుటుంబమే ఆ స్థానంలో విజయం సాధిస్తోంది. జ్యోతిరాదిత్య సిందియా 2002లోను,
2014లోనూ గుణ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా నిలిచి గెలిచారు. అయితే బీజేపీలోకి మారిన
తర్వాత ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2019లో గుణలో బీజేపీ అభ్యర్ధి కృష్ణపాల్
యాదవ్ గెలిచారు.

బీజేపీ మొదటి జాబితాలో ఉండే అవకాశమున్న పేర్లు
ఇలా ఉన్నాయి…. అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ దిబ్రూగఢ్ నుంచి పోటీ
చేయవచ్చు.అస్సాంలో బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తుంది, 3 స్థానాలను మిత్రపక్షాలకు
కేటాయిస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నిన్ననే వెల్లడించారు. అక్కడ అసోం గణ
పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ అనే రెండు పార్టీలు బీజేపీతో పొత్తులో
ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లో ఈసారి భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌కు
అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఆ సీటును మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్
చౌహాన్‌కు ఇస్తారని సమాచారం. అయితే చౌహాన్, తన సొంత జిల్లాలోని విదిశ స్థానం
ఆశిస్తున్నారు. అక్కడినుంచి ఆయన ఐదుసార్లు గెలిచారు. అలాగే, విదిశలో గెలుపు బీజేపీకి
నల్లేరు మీద బండి నడకే. అక్కడ 1989 నుంచి బీజేపీయే గెలుస్తోంది.

నిన్నటి సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లో మిత్రపక్షాల
గురించి కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఆ రాష్ట్రంలో అప్నాదళ్, రాష్ట్రీయ లోక్‌దళ్‌
పార్టీలు బీజేపీతో పొత్తులో ఉన్నాయి.

మొత్తంగా చూసుకుంటే,
మార్చి 10లోగా కనీసం 50శాతం స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసేయాలని బీజేపీ
భావిస్తున్నట్లు సమాచారం.

Tags: BJP MeetingCandidates FinalizedCentral Election CommitteeLok Sabha Polls 2024
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.