దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలకుతోడు, దేశంలో వృద్ధిరేటు అంచనాలను మించిపోతుందనే వార్తలు రావడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలార్జించాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 421 పాయింట్లు పెరిగి 72922 వద్ద మొదలైంది. నిప్టీ 146 పాయింట్లు పెరిగి 22128 వద్ద ట్రేడవుతోంది. రూపాయి స్వల్పంగా బలపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.82.86కు చేరింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతీ, ఎస్‌బిఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబరు నుంచి డిసెంబరు త్రైమాసికంలో జీడీపీ 8.4 శాతం అనూహ్య వృద్ధి నమోదు చేసింది. దీంతో పెట్టుబడిదారులు స్టాక్స్ కొనుగోళ్లకు మొగ్గుచూపారు.